గుర్తు తెలియని మృతదేహం లభ్యం

★ వివరాలు తెలిస్తే సంప్రదించాలని తెలిపిన ★ ముల్కనూర్ ఎస్సై రాజు

పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సమీపంలోని సమ్మక్క-సారలమ్మ గుట్ట ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహన్ని గమనించిన స్థానికులు వెంటనే ముల్కనూర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై రాజు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, ఎడమ వైపు ఛాతి మీద ఇంగ్లీషులో అమ్మ అనే పచ్చబొట్టు కలిగి ఉందని, నలుపు రంగు జీన్స్ ప్యాంటు, పింక్ కలర్ చొక్కా ఫుల్ హాండ్స్ వేసుకొని, శవం బాగా కుళ్లిన స్థితిలో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే ముల్కనూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు..