పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామపంచాయతీలో మొదటి గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి అధ్యక్షత వహించిన గ్రామసభలో ఉప సర్పంచ్ మాట్ల హరికుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించి యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు.. గ్రామస్తులు పలు సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని పాలకవర్గం హామీ ఇచ్చారు.. గ్రామంలో ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ సిబ్బంది సమయపాలన వంటి పలు అంశాలపై చర్చలు చేశారు.. గ్రామంలో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని సూచించారు.. మహిళా గ్రామ సమైక్య భవన నిర్మాణం తీర్మానం చేసినట్లు తెలిపారు.. అవసరమైన చోట స్తంభాల ఏర్పాటుతో పాటు, స్ట్రీట్ లైట్లు, స్మశాన వాటిక పల్లె ప్రకృతివనంకు, విద్యుత్ కనెక్షన్, మంచినీటి పైపులైను లీకేజ్ లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.. అనంతరం ముత్తారం చెరువు స్థానిక మత్స్యకారులతో నిర్వహణ చేయాలని కొందరు గ్రామస్తులు వినతిపత్రం అందజేసారు.. దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.