గ్రామాలలో కాశీబుగ్గ పోలీసులు అవగాహన సదస్సులు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస మండలం హిమగిరి గ్రామాన్ని గురువారం కాశీబుగ్గ ఎస్సై ఆర్ నరసింహమూర్తి సందర్శించారు .నారీ శక్తి, సైబర్ నేరాలు, సంకల్పం, మహిళలపై నేరాలు, బాల్య వివాహాలు మొదలైన వాటిపై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ను నిర్వహించారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లో నైనా తమకు తాముగా కాపాడుకోవాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడు పోలీసు వారికి తెలియజేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాశిబుగ్గ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.