చండూరులో పిచ్చికుక్క స్వైర విహారం 12 మందికి గాయాలు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు జనవరి 09 (రిపోర్టర్ : కస్తాల స్వామి ) చండూరు మున్సిపాలిటీలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానిక యూనియన్ బ్యాంకు, కస్తాల రోడ్డు సమీపంలో బ్యాంకుకు వచ్చిన వివిధ గ్రామాల వారితో పాటు మున్సిపాలిటీకి చెందిన 12 మందిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడిన వారిని చండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య సిబ్బంది యాంటి రేబిస్ వాక్సిన్ ఇచ్చి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం 10 మందిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య అధికారి మాస రాజు తెలిపారు. కొందరు స్థానికులు పిచ్చి కుక్కను పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోయిందని తెలిపారు .