చిట్వేలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎస్ పి. శ్రీనివాసా రావు.

పయనించే సూర్యుడు తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జనవరి 9 అద్దంకి శివ రిపోర్టర్ చిట్వేలి పోలీస్ స్టేషన్ ను రేణిగుంట డి ఎస్ పి. శ్రీనివాసా రావు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు.రైల్యే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా లో విలీనం చేసిన నేపథ్యంలో చిట్వేలి పోలీస్ స్టేషన్ ను డీఎస్పి తనిఖీచేశారు. ఈసందర్బంగాస్థానిక విలేకరులతో స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను, రికార్థులను పరిశీలించారు.ఈసమావేశంలో విలేకరులు ప్రస్తావించిన పలుఅంశాలకు స్పందిస్తూ ఆదిశగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ ఐ. వినోద్ కుమార్ ను ఆదేశించారు. ఈకార్యక్రమంలో రైల్యే కోడూరు రూరల్ సి ఐ. శ్రీనివాసులు, ఎస్ ఐ, సిబ్బంది పాల్గొన్నారు.