చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు

★ పెద్ద శంకరంపేట్ ఎస్‌ఐ ప్రవీణ్ రెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 9 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) చైనా మంజా విక్రయం వినియోగం పూర్తిగా నిషేధించబడిన నేపథ్యంలో పెద్ద శంకరంపేట్ మండలంలో ఎస్‌ఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో గాలిపటాలు విక్రయించే దుకాణాలతో పాటు ఇతర వాణిజ్య కేంద్రాలను పరిశీలించారు నిషేధిత చైనా మంజాను విక్రయించినా లేదా నిల్వ ఉంచినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలుతీసుకుంటామని ఎస్‌ఐ ప్రవీణ్ రెడ్డి హెచ్చరించారు చైనా మంజా వలన పక్షులు జంతువులు ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించిందని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు చైనా మంజా విక్రయాలపై ఎవరైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు ప్రజల సహకారంతో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు ఈ తనకి లో పెద్ద శంకరంపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు