పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 09 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఉన్నత పాఠశాలలో చదువుచున్న పదవతరగతి ఒక విద్యార్థిని ఈ విద్యసంవత్సరం ప్రారంభమైన నుండి 139 పని దినాలకు గాను కేవలం 24 రోజులే బడికి రావడంతో నిత్యం బడికి రాకపోవడంతో జగిత్యాల జిల్లా విద్యశాఖాధికారి కేలోత్ రాము నాయక్ ఆదేశాల మేరకు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు, మాజీ ప్రజాప్రతినిధులను ఇర్రెగ్యూలర్ విద్యార్థిని ఇంటికి తీసుకవెళ్ళి విద్యయొక్క ఆవశ్యకత ను, పదవ తరగతి పాసైతే కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. డిఈవో ఆదేశాలకంటే ముందు చాలా సార్లు వెళ్ళినా రావడంలేదని ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఎంత చెప్పిన బాలిక ఇంటిలో నుండి బయటి రాకపోవడం, నేను చదువుకోను, పాఠశాలకు రాను, పరీక్షలు వ్రాయనని మారాం చేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోటో దిగి వచ్చారు. మానసిక స్థితి, ఫోన్ కు అడిక్ట్ కావడము, మూఢనమ్మకాలే ఈ స్థితికి కారణము కావచ్చని భావిస్తున్నారు. జిల్లాలో గల ఈ రకమైన స్థితి గల ఇర్రెగ్యూలర్ బాల బాలికలకు ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా ఆశించిన ఫలితాలు రావచ్చని ఆ దిశగా సంబందిత జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నీరటి శ్రీనివాస్, పలువురు కోరుచున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి ఆదిరెడ్డి, ఆర్యుపిపి జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రమేష్, నరేష్, నవీన్, రాజుకుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.