పయనించే సూర్యుడు జనవరి 9 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సన్ పల్లి గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం సమావేశం గురువారం సర్పంచ్ దండెం సుశీల దుర్గయ్యా అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను వార్డు సభ్యులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు.గ్రామంలో వాటర్ డ్రైనేజీ, అంగ న్ వాడి, రైతువేదిక తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండీ.సిరాజ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.