పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సున్నాడా గ్రామంలోని మండల ప్రజా మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో వారం రోజులపాటు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో గురువారం చివరి రోజు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించి, పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి. మధు, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పి. వెంకట రమణ, లైబ్రేరియన్ నరసింహులు, డాక్టర్ వై. వెంకటలక్ష్మి (హిందీ లెక్చరర్), ఇతర అధ్యాపకులు, క్లర్క్ సురేష్ , తుంబే శ్వరరావు, గౌతమి, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.