పల్నాడు జిల్లా ఐటీ వింగ్ సెక్రటరీగా బిరుదు అనంత బాబు-కృతజ్ఞతలు, బాధ్యతాయుత సంకల్పం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 యడ్లపాడు మండల ప్రతినిధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ఐటీ వింగ్ సెక్రటరీగా తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిక, మాజీ మంత్రి విడదల రజినికి బిరుదు అనంత బాబు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పదవితో తనపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్న బిరుదు అనంత బాబు, పార్టీ బలోపేతం కోసం, జగనన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ ద్వారా నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.