పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 యడ్లపాడు మండల ప్రతినిధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పల్నాడు జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా పల్లపు లక్ష్మీనారాయణను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని సూచించారు. బీసీ వర్గాల హక్కుల పరిరక్షణకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలంగా నిలబెట్టేందుకు నిరంతరం పనిచేస్తానని పల్లపు లక్ష్మీనారాయణ తెలిపారు