
పయనించే సూర్యుడు జనవరి 9 బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడవటూరులో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ అందరూ కూడా పాఠశాలలను సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్ అభ్యసన దీపికలను వారి సమక్షంలో పంపిణీ చేయడం జరిగినది. అనంతరం ప్రధానోపాధ్యాయులు నరసింహ స్వామి అతిథి భోజనాన్ని అతిథులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు అందించడం జరిగినది. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ్ నీల కవిత మురళి,ఉప సర్పంచ్ గంగం దయాకర్ రెడ్డిని,వార్డ్ మెంబర్లు స్వరూప, శివకుమార్, మాధవి, రమ్య, బాల సిద్ధులు, నాగరాజు, రవికుమార్, మానస రమేష్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీల కవిత మురళి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తమ వంతు పాత్ర ఎల్లప్పుడూ ఉంటుందని పాఠశాల కావలసినటువంటి మౌలిక వసతులను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. ఉన్నత పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొని విద్యార్థుల నమోదును పెంచడంలో కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ ఏ పీ సి చైర్మన్ కె. అంజమ్మ ఉపాధ్యాయులు యాదగిరి,కిషన్, మహ్మద్ అంకుషావలీ, రఘుమూర్తి,ప్రభాకర్, సిద్ధులు మరియు తార తదితరులు పాల్గొన్నారు