పాలకుర్తి అభివృద్ధి వైపు నూతన పాలకవర్గం తొలి అడుగు

పయనించే సూర్యుడు జనవరి 9 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) పాలకుర్తి గ్రామంలో ప్రధాన కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టి తొలగింపు పనులను నూతన పాలకవర్గం పురోగమింపజేసింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించాలన్న దృక్పథంతో కొత్త వ్యవస్థ ప్రారంభం నుండే చురుకుదనం కనబరుస్తోంది. ఈ సందర్భంగా పాలకుర్తి నూతన సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్ మాట్లాడుతూ పాలకుర్తి అభివృద్ధి, పరిశుభ్రత, పారదర్శక పాలన మా ప్రధాన లక్ష్యాలు. గ్రామంలో ఏ సమస్య ఉన్న వెంటనే తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆశలు, అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపడతాము అని తెలిపారు. నూతన పాలకవర్గం తాజా ఉత్సాహంతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, ప్రతి వాడ,వీధిని శుభ్రమైన సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించాలని సంకల్పబద్ధత వ్యక్తం చేసిందాని ప్రజల భాగస్వామ్యంతో మరింత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గ్రామ ప్రజలు కూడా నూతన పాలన విధానాన్ని అభినందిస్తూ, సమస్యల పరిష్కారంలో చూపుతున్న వేగంసేవా భావం పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పాలకుర్తి గ్రామంలో ప్రధాన కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టి తొలగింపు పనులను నూతన పాలకవర్గం పురోగమింపజేసింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించాలన్న దృక్పథంతో కొత్త వ్యవస్థ ప్రారంభం నుండే చురుకుదనం కనబరుస్తోంది. ఈ సందర్భంగా పాలకుర్తి నూతన సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్ మాట్లాడుతూ పాలకుర్తి అభివృద్ధి, పరిశుభ్రత, పారదర్శక పాలన మా ప్రధాన లక్ష్యాలు. గ్రామంలో ఏ సమస్య ఉన్న వెంటనే తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆశలు, అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపడతాము అని తెలిపారు.