పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్.జి-3 జి.యం

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ -09 పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ని గురువారం నూతనంగా బాధ్యతలను స్వీకరించిన రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి పరిచయం చేసుకున్నారు. సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వారికి తెలియజేసి, ఏరియాలోని వివిధ గనుల విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం సహాయ సహకారాలను అందించాలని కోరారు. అనంతరం ఎస్.డి.సి. బాణోత్ రాములు ని మర్యాద పూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్స్ మేనేజర్ కె.ఐలయ్య, జూనియర్ ఎస్టేట్స్ అధికారి మణిదీప్ రెడ్డి, పాల్గొన్నారు.