పెనుబల్లి మండలం- మండాలపాడు గ్రామ పంచాయతీ: నూతన గ్రామ సర్పంచ్ గాయం రమేష్ , ఈ రోజు మండాలపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

పయనించే సూర్యుడు: జనవరి 9 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్ :గద్దె విజయబాబు అక్కడ ఉన్న చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్ మరియు ఆయాతో మాట్లాడి, వారి బాగోగులు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా లంకపల్లి సెక్టార్ సూపర్ వైజర్ శ్రీమతి అనురాధ తో కలిసి పిల్లలకు ప్రభుత్వం అందించిన యూనిఫార్మ్ అందజేశారు. మరియు గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారం అందించే కోడిగుడ్లు ,పిండి అందజేశారు. ఈ నూతనంగా ఎన్నికైన సందర్భంగా గాయం రమేష్ కి అంగన్వాడీ టీచర్ స్వరూపా రాణి స్వీట్స్ అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాన్ని సర్పంచ్ రమేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషోర్ పోతురాజు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ, ఇడుపులపాటి రాంబాబు, స్కైలాబ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ యడవల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.