ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎంపీడీవో

పయనించే సూర్యుడు జనవరి 9 గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం కాట్రేనికోన పంచాయతీ అధికారులు సిబ్బంది ఆయా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీవో రాజేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓల ఎన్. శంకర నారాయణ, ఎస్ సూర్యనారాయణ రాజుతో ఆయన సమీక్షించారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ & అభివృద్ధి కార్యక్రమాలపై ఆరాతీశారు. పారిశుధ్యం, మంచినీరు, వీధిలైట్ల నిర్వహణపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించాలని కార్యదర్శులను ఆదేశించారు.విధుల నిర్వాహణలో సమయపాలన పాటించాలని, గ్రామాల్లో ప్రజానీకానికి నిత్యం అందుబాటులో ఉండాలని హితవుపలికారు. సచివాలయం సిబ్బంది పనితీరు మెరుగు పరచాలని కోరారు. సమీక్షలో డిప్యూటీ ఎంపీడీఓలు సూర్యనారాయణ, శంకర నారాయణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.