ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజా ప్రతిభ ఆర్.సి రిపోర్టర్ ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో

★ ఆవిష్కరించిన హుజురాబాద్ టౌన్ సిఐ టి.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య.

పయనించే సూర్యుడు జనవరి 9 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, ప్రజా సంఘాల నాయకులు హుజురాబాద్ పట్టణంలో హుజూరాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కే సారపు సమ్మయ్య, బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికావిలేకరులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వము ప్రజా శ్రేయస్సు కొరకు పని చేయునట్లుగా చూడవలసిన బాధ్యత విలేకరులపైన ఉందని అదే విధంగా ప్రజలను కూడా ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ, సమాజంలో ప్రధాన పాత్ర స్పోషించాలని కోరారు. ప్రభుత్వానికి నాలుగవ మూల స్తంభమైన పత్రికలు పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వానికి సమాజానికి ఆదర్శంగా ఉంటూ ఉన్నత మైన సేవలను ఎల్లప్పుడూ అందించడంలో ప్రజా ప్రతిభ పత్రిక కూడా ముందు బాగాన ఉంటూ పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆకాంక్షించినారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, మాజీ సర్పంచ్ రామ్ శంకర్ గౌడ్, పూలే కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్స్ కె.నరసింహారెడ్డి, యాదగిరి నాయక్, కన్నెబోయిన తిరుపతి, తాటిపాముల కనుకయ్య, బొంగోని వెంకటయ్య, తాత సమ్మయ్య, కన్నెబోయిన సమ్మయ్య, మాచర్ల నరేష్, తాళ్ల పెళ్లి రాజేష్, సందమల్ల బాబు, తదితరులు పాల్గొన్నారు