ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అవగాహన ర్యాలీ

పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 9సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణలో గురువారం రోజనా రోడ్ సూరక్ష భద్రత లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026 లో భాగంగా ఈరోజు గజ్వెల్ పట్టణంలో జాతీయ రహదారి 161 AA పైన గజ్వేల్ కోర్టు నుండి పిడిచేడ్ X రోడ్ వరకు గజ్వేల్ అడిషనల్ JFCM కోర్టు మేజిస్ట్రేట్ శ్రీ మనివీర్, గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మరియు గజ్వేల్ కోర్ట్ అడ్వకేట్లు పోలీస్ సిబ్బంది కలిసి ర్యాలీ పిడిచేడ్ X రోడ్డు వరకు నిర్వహించడం జరిగింది. పిడిచేడ్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి రోడ్డుపైన వాహనాలు నడుపుతున్న వాహనదారులకు ట్రాఫిక్ చట్టాల పైన అవగాహన కలిగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ట్ సూపరిండెంట్లు జ్యోతింద్రనాథ్ రెడ్డి, హనుమంత రెడ్డి, మరియు కోర్టు సిబ్బంది గజ్వేల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు, ప్రజలు వాహనదారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.