
పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ కొంగరకలన్ ఐడిఓసి కార్యాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఫ్యూచర్ సిటీ సీపీ గా నియమితులైన సుధీర్ బాబు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. షాద్ నగర్ నియోజక వర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో 50 శాతం కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఖాళీ ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్ళారు ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని కోరారు. షాద్ నగర్ నియోజక వర్గంలో ఉన్న 6 మండలాలు, 2 మున్సిపాలిటీ లను ఒక డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా నియోజకవర్గం అంతా ఒక డివిజన్ గా ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కొత్తూరు, నందిగామ మండలాలు శంషాబాద్ డివిజన్ భాగంగా ఉండటం, మిగిలిన మండలాలు షాద్ నగర్ డివిజన్ ఉండటం మూలంగా పరిపాలన సౌకర్యవంతంగా లేకుండా గందరగోళంగా ఉండేదని పేర్కొన్నారు.