బట్రెడ్డి జనార్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్సార్ టిఎఫ్ రాష్ట్ర నేతలు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 9 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బట్రెడ్డి జనార్ధన్ రెడ్డి ని రాష్ట్ర వైస్సార్ టిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మెట్టుకూరు సుబ్బారెడ్డి మరియు డేనియల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2026వ నూతన సంవత్సరానికి సంబంధించినవైఎస్ఆర్ టిఎఫ్ డైరీ మరియు క్యాలెండర్‌ను ఆయనకు అందజేశారు. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల శుభాకాంక్షలను ముందస్తుగా తెలియజేశారు.ఈ భేటీ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై స్నేహపూర్వకంగా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీని ప్రజల్లో మరింత బలంగా నిలిపే దిశగా కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు.