బిజినపల్లి లో సేవాలాల్ గుడికి 3 కోట్ల రూపాయల మంజూరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఘన సన్మానం

★ కార్యక్రమంలో మండల ఎస్టీ సర్పంచులు ఉపసర్పంచులు వార్డ్ మెంబర్లు

పయనించే సూర్యుడు జనవరి 9 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని సేవాలాల్ గుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ను, ఎమ్మెల్సీ ని బిజినపల్లి మండలానికి చెందిన ఎస్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్టీ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టి నాయకులు మాన్య నాయక్ గోవిందు నాయక్ వాలియా నాయక్ బిజినపల్లి మండలంలోని ఎస్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొని సేవాలాల్ గుడి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ గుడి అభివృద్ధితో ఆధ్యాత్మికతో పాటు సాంస్కృతిక పరంగా ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తుందని వారు అన్నారు.