బోధన్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

★ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలి.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 బోధన్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమామహేశ్వరరావు భోధన్ ఏసిపి శ్రీనివాస్ గురువారం బోధన్ పట్టణంలోని జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఆచన్ పల్లి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిటిఓ. ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం కొరకే రోడ్డు భద్రత మసోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్లు నడపకుండా చూడాలని ప్రమాదాలు జరగకుండా నివారించాలని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎంవీఐ శ్రీనివాస్. ఎక్సెల్ సీఐ భాస్కర్ రావు, బోధన్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి,ఎడపల్లి ఎస్సై రమ,పోలీసులు యువకులు తదితరులు పాల్గొన్నారు