పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 09.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ 48,85,165లు ఆదాయంగా సమకూరినట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు గురువారం అమ్మవారి సన్నిధానం వద్ద గల ఆడిటోరియంలో 31 రోజులుగాను నిర్వహించిన ు హుండీి లెక్కింపు ద్వారా నగదు తో పాటు 19 గ్రాముల బంగారం 292 గ్రాములు వెండిని భక్తులు అమ్మవారికి ముడుపులుగా చెల్లించినట్లు ఆయన వివరించారు అదేవిధంగా రూ 28,943లు ఆదాయంగా సమకూరిందన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ గ్రామీణ బ్యాంకు పోలీసు సిబ్బంది ఆలయ అర్చక అధికార సిబ్బంది సేవకులు పాల్గొన్నారు