భోపాల్‌లో పరికిపండ్ల నరహరి ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు

★ వాలభాపూర్ గ్రామానికి చెందిన ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గుణ సాగర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ★ పేదల సేవే మనందరి బాధ్యత: నరహరి ఐఏఎస్ వ్యాఖ్యలు ★ ఆలయ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్ష

పయనించే సూర్యుడు / జనవరి 9 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; వీణవంక మండలం వాలభాపూర్ గ్రామానికి చెందిన ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గుణ సాగర్ భోపాల్ లో ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్‌ను తన నివాసం లో మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నరహరి ఐఏఎస్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి పేదవాడికి పెద్దన్నలా నిలబడి సేవ చేయాల్సిన బాధ్యత మనందరిదేనని అన్నారు. అలా పనిచేసినప్పుడే మన లక్ష్యాలు, ఆశయాలు సాకారమవుతాయని స్పష్టం చేశారు.పేదల అభ్యున్నతి కోసం ఆలయ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.