పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 09, మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని మండల కేంద్రంలోని రాఘవుల నగర్ (బస్టాండ్ ఎదురుగా ఉన్న లైన్) లో గతంలో నిలిచిపోయిన ఆధార్ సేవా కేంద్రం తిరిగి ప్రారంభమైంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (సూరయ్య పల్లి శాఖ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాన్ని, నూతన ఆధార్ కిట్‌తో పునరుద్ధరించినట్లు ఆపరేటర్ సొక్కుల శ్రీకాంత్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ నుండి నిలిచిపోయిన సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులను తప్పనిసరిగా అప్‌డేట్ (డాక్యుమెంట్ అప్డేట్) చేసుకోవాలని, అలాగే చిరునామా, ఫోన్ నంబర్ మార్పులు, బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి సేవల కోసం మంథని మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.