
పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలోని వంగర గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సొసైటీ ఆర్గనైజర్ కొండి పాముల సుహాసిని బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. సామాజిక సేవా దృక్పథంతో అనారోగ్యంతో బాధపడుతున్న మల్లమారి శ్రీనివాస్ కుటుంబానికి 10000, బత్తిని రాజయ్య కు 2500, వెంగళ రజినీకాంత్ సుమలత కుమారుడు వెంగల అభినయ్ కు 20000, రొడ్డ కొమురమ్మ కు 2500, కుటుంబాలకు కుటుంబాలకు ఆర్థిక సహాయం, పండ్లు అందజేశారు. తీవ్ర అనారోగ్యం, వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు చికిత్స నిమిత్తం సొసైటీ తరఫున నగదు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఆర్గనైజర్ కొండి పాముల సుహాసిని మాట్లాడుతూ” నిరుపేదలకు వైద్య సహాయం అందించడం సామాజిక సేవగా భావిస్తున్నామన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడమే మా ప్రధాన లక్ష్యమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. ఈసందర్భంగా ఆర్థిక సహాయం పొందిన బాధితులు వారి కుటుంబ సభ్యులు సొసైటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న తమను ఆదుకొని భరోసా కల్పించిన సొసైటీ సేవలు అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజర్ సుహాసిని, సభ్యులు రజిత, స్వప్న, స్వరూప, వార్డ్ మెంబెర్ కండె శారద చక్రపాణి, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్రి దేవరాజ్ పాల్గొన్నారు..