రంపచోడవరం డివిజన్ పదవికి ముగ్గురు పోటీ

పయనించే సూర్యడు ప్రతనిధి సాగర్ జనవరి. 09. 01.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం భారత్ ఆదివాసి పార్టీ రంపచోడవరం ఇన్చార్జి మద్దిటి అంజి రెడ్డి మాట్లాడుతూ రంపచోడవరం లో డివిజన్ పరిధిలో భారత్ ఆదివాసి పార్టీ కమిటీ ఏర్పాటు చేయుట కొరకు సీనియార్టీ భారత్ ఆదివాసి పార్టీ సభ్యతలు తీసుకొని మండల వేదిక పదవులు స్వీకరించిన వారికి సీనియర్ను బట్టి రంపచోడవరం డివిజన్ పదవి ఇవ్వడం జరుగుతుంది.ఈ పదవికి రంపచోడవరం డివిజన్ అధ్యక్షుడు పదవికి భారత్ ఆదివాసి పార్టీ నుంచి ముగ్గురు నాయకులు అధ్యక్ష పదవికి పోటీ చేయడం జరుగుతుంది భారత్ ఆదివాసి పార్టీ నుంచి రంపచోడవరం మండలం అధ్యక్షుడు పండ కృష్ణ మూర్తి వై.రామవరం మండలం అధ్యక్షుడు కురుసం సత్యనారాయణ దొర మారేడుమిల్లి మండలం మాజీ అధ్యక్షుడు బలిజ చిన్నా రెడ్డి ఈ ముగ్గురు భారత ఆదివాసి పార్టీ డివిజన్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎలక్షన్ అడ్డతీగల మండలం ఆదివాసి భవనం నందున 12 తారీఖున సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఎలక్షన్ కొనసాగుతుంది భారత ఆదివాసి పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ హాజరై మండల అధ్యక్షులు కార్యదర్శులు మహిళా అధ్యక్షులు కార్యదర్శులు పంచాయతీ అధ్యక్షులు పంచాయతీ కార్యదర్శులు భారత ఆదివాసి పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా విధిగా అందరు హాజరై మీకు నచ్చిన వాళ్ళకి రాజ్యాంగ పరంగా మీ ఓటు వేసి అధ్యక్షుడు పదవికి మీకు నచ్చిన వారికి ఓటు వేసుకోవాలి అని భరత్ ఆదివాసి పార్టీ కార్యకర్తలకి నాయకులకు మీకు నచ్చిన వారికి ఓటేసి రంపచోడవరం డివిజన్ అధ్యక్షుడు పదవికి ఓటు వేయాలని పోలవరం జిల్లా భారత్ ఆదివాసి పార్టీ రంపచోడవరం నియోజకవర్గం ఇన్చార్జి మద్దిటి అంజి రెడ్డి తెలిపారు భారత్ ఆదివాసి పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కట్రం రామదాసు కోయ భారత ఆదివాసి పార్టీ రంపచోడవరం డివిజన్ యువజన అధ్యక్షుడు పల్లాల బుజ్జి నారాయణ రెడ్డి భారత్ ఆదివాసి పార్టీ అడ్డతీగల మండలం ఆదివాసి మహిళా అధ్యక్షురాలు రెడ్డి పోలు విశ్వనాథమ్మ ఆదివాసి మహిళా కార్యదర్శి పరిశిక పూర్ణమ భారత్ ఆదివాసి పార్టీ అడ్డతీగల మండలం అధ్యక్షుడు సాలపు రెడ్డి అబ్బా రెడ్డి ఆదివాసి పార్టీ సీనియర్ నాయకులు కొలికల పురాగం మాజీ సర్పంచ్ నడిపూడి రాజకుమార్ రెడ్డి విద్యార్థి విభాగం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.