పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 09 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం భూపతిపూర్లోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దూపదీప నైవేద్య అర్చక సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జగిత్యాల జిల్లా అధ్యక్షులు నాగరాజు మహీంద్రా చారి, ప్రధాన కార్యదర్శి అల్వలా ఆత్మరాం, సహాయ కార్యదర్శి దేశ్ ముఖ్ ఫణిందర్ శర్మ, ప్రచార కార్యదర్శి బ్రహ్మాన శంకర్ శర్మ హాజరయ్యారు. సమావేశంలో కాకుస్తం వెంకట కృష్ణను రాయికల్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో అర్చకులు తిరునహరి శేఖర్, జక్కాపురం శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్, కోటగిరి శ్రీనివాస్, తిరుణగరి శ్రీకాంత్,సాయికుమార్, ప్రదీప్, రమణ తదితరులు పాల్గొన్నారు.
