లేబర్ కాలనీకి రోడ్డు వేయండి మున్సిపల్ కమిషనర్ కు వినతి

★ కౌన్సిలర్ లలితమ్మ ఉషారాణి

పయనించే సూర్యుడు జనవరి 9 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి : ఆదోని మున్సిపల్ కమిషనర్ కలిసి వినతి పత్రం సమర్పించిన కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ, బిజెపి మహిళా అధ్యక్షురాలు, ఉషారాణి. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ ఆర్ లేబర్ కాలనీకి రోడ్డు వసతిలేక కాలనీ వాసులకు, మరియు హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్లలో రోజు దాదాపు వెయ్యిమంది వరకు ప్రయాణం చేస్తారని, అంత రద్ధీ ఉన్న ఆలూరు హై వే రోడ్డు నుండి లేబర్ కాలనీకి వెళ్ళే అప్రోచ్ రోడ్డు సరిగా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు వికలాంగులు నడవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతేకాకుండా రైల్వే బియ్యం గోడౌన్ నుండి, మార్కెట్ యార్డు గోడౌన్ కి బియ్యం తరిలించే వాహనాలు వందల సంఖ్యలో తిరుగుతున్నాయని, అందువల్ల రెండు పెద్ధ వంకల మధ్యలో ఉన్న రోడ్డు కి ఇరువైపుల ప్రహారీ గోడలేకపోవడం వల్ల స్కూల్ పిల్లలు సైకిళ్ళు అదుపుతప్పి వంకలోకి పడిపోతున్నారని లలితమ్మ, ఉషారాణి, కమీషనర్ కు వివరించారు. వెంటనే స్పందించిన కమీషనర్ ఇది రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి వస్తుందని తప్పకుండా మున్సిపాలిటీ తరుపున రోడ్లు భవనాల శాఖ కు తెలియజేస్తానని కమీషనర్ కృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో 31వ వార్డు కౌన్సిలర్ గొల్ల పద్మావతి, పట్టణ బిజెపి మహిళా కార్యదర్శి వినీతాగుప్త, మొదలైన వారు పాల్గొన్నారు.