విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

★ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 బోధన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలంగాణ విద్యార్ధి పరిషత్ అధ్వర్యంలో రెంజల్ మండలంలోని రెంజల్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని.అలాగే మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నాణ్యమైన భోజనం అందించకపోతే తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్ , నవదీప్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.