విద్యుత్ చార్జీలపై విలేకరుల సమావేశం నిర్వహించిన టిడిపి సీనియర్ నాయకులు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 9 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న రామకృష్ణ ఫంక్షన్ హాల్, సమావేశం విద్యుత్ చార్జెస్ గురించి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు. ఎప్పుడు ట్రూ అప్పే! ఇకనుండి ట్రూ డౌన్! కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ వినియోగదారుల కళ్ళలో వెలుగులు గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో రకరకాల ఛార్జిలతో వినియోగదారుల నడ్డి విరిచారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం పిపిఏ ల రద్దు వలన కంపెనీలకు ప్రభుత్వం చెల్లించిన పెనాల్టీ ₹9000/- వేలకోట్లు. విద్యుత్ చార్జీలు తో ప్రజలపై పెనుబారం మోపిన గత ప్రభుత్వం. విద్యుత్ నిర్వహణలో అసమర్ధత.
గత ప్రభుత్వం పిపిఎ. లను రద్దు చెయ్యడం వలన విద్యుత్ రంగానికి వచ్చిన మొత్తం నష్టం ₹47,741/- కోట్లు. విద్యుత్ పంపిణి సంస్థలు ఒక ఏడాది పవర్ కొనుగోలు మరియు ఇందన ఖర్చులను అంచనా వేసి టారిఫ్ నిర్ణయిస్తారు. ఈ టారిఫ్ కంటే వాస్తవ ఖర్చులు తక్కువగా ఉంటే వాటిని వినియోగదారులకు ఆ మిగులు బదిలీ చెయ్యాలి. దానిని ట్రూ డౌన్ చార్జెస్ అంటారు. ఖర్చులు ఎక్కువగా ఉంటే ట్రూ అప్ చార్జెస్ అంటారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ అప్పే కానీ డౌన్ లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ట్రూ డౌన్ చార్జెస్ వినియోగదారులకు తిరిగి చెల్లించే ఏర్పాటు చేసింది. ఉదాహరణకు నెలకు 200 యూనిట్లు వినియోగం చేసే విద్యుత్ వినియోగదారునికి నెలకు ₹29/- ట్రూ డౌన్ చార్జెస్(రిఫండ్) క్రింద అక్టోబర్ 2026 వరకూ చెల్లిస్తుంది. ఈ మొత్తం సుమారు ₹4500/- కోట్లు ప్రభుత్వంమే చెల్లిస్తుంది. యూనిట్ కు 13 పైసలు చెల్లిస్తుంది. ప్రస్తుతం సంక్షోభం లో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి కూటమిప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. పునరుత్పాదక విద్యుత్ ప్రోత్సహం. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ కు తక్షణ సాయం కోసం కేంద్ర సహాయం. విద్యుత్ చార్జీలు పెంచకుండా చూడడం. నాణ్యమైన విద్యుత్ సరఫరా. మొదలగు అంశాలతో ముందుకు వెళుతుంది కూటమి ప్రభుత్వం. రామకృష్ణ ఫంక్షన్ హాల్, పెనుగంచిప్రోలులో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి .నలమోలు వెంకట శివరామ ప్రసాద్, పెనుగంచిప్రోలు మండల టీడీపీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, పెనుగంచిప్రోలు మాజీ నీటి సంఘం అధ్యక్షులు వేగినేటి గోపాల కృష్ణమూర్తి, మాజీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ జడ్పీటీసీ కాకాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.