విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

★ శోకసంద్రంలో గ్రామ ప్రజలు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 9, తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన గొల్లమందల శ్రీనివాసరావు, ( సుబ్బు) (34), విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. వివరాల్లోకెళితే గొల్లగూడెం మంగాపురం మధ్యలో ఉన్నటువంటి కౌలు భూమి మూడు ఎకరాల సాగు నిమిత్తం, పంట పొలానికి వెళ్ళాడు పొలానికి నీరు పెట్టే సమయంలో, పొలంలో ఉన్న మోటర్ ఫీజ్ వేసే సందర్భంలో ప్రాణాలను విడిచాడు. మరణ వార్త తెలుసుకున్న గ్రామ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, పాప బాబు, ఉన్నారు.