వెన్నంపల్లిలో స్వయంభూ మత్స్యగిరీంద్ర బ్రహ్మోత్సవాలు

పయనించే సూర్యుడు జనవరి 09 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి వెన్నంపల్లి గ్రామంలోని మత్స్యగిరీంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 25 నుండి ఫిబ్రవరి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈనెల 28న ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, 29న మధ్యాహ్నం 1.15 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న పౌర్ణమి జాతర, 2న సాయంత్రం నాకబలి (పుష్పయాగం) ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.