పయనించే సూర్యుడు జనవరి 09 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రానికి చెందిన సట్టు మనోజ్ ఆక్సిడెంట్లో అకాల మరణం చెందిన యువకుడికి బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి ధూళిపాల ధనంజయ నాయుడు మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు కలిగిన యువకుడు అకాలమరణం చెందడం బాధాకరమని, అతని మరణం కుటుంబానికే కాక యావత్తు బీసీ లోకానికి తీరని లోటు అని, మనోజ్ కు యువతలో ఎంతో ఫాలోయింగ్ ఉన్నదని ఈరోజు అతని సంతాప సభలో నిరూపణ అయిందని. అతని మరణం తీర్చలేని లోటు ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలి ఆయన కోరారు. సంతాప సమావేశంలో. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలక రాజు శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రజు వెంకట్, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు బెల్లంకొండ గోవిందు, గౌడ్ సట్టు రామలింగం, సట్టు పుల్లయ్య, తురక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు