పయనించే సూర్యడు జనవరి 09 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు కృషి విజ్ఞాన కేంద్రం- గడ్డిపల్లిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ( ఎన్ఎన్ఎఆర్ఎం), రాజేంద్రనగర్ వారి ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన రైతులకు ఐదు రోజుల సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజున రైతుల బృందం సిరిపురం గ్రామం, నడిగూడెం మండలంలో సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై క్షేత్ర సందర్శన చేసినట్లు కే.వి. కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ తెలిపారు.సిరిపురం గ్రామ రైతు వశీకర్ల శేషు కుమార్ స 1.5 ఎకరం లో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, గొర్రెలు, నాటు కోళ్ల పెంపకం, గడ్డిజాతి పంటలు పండ్ల తోటలలో సమగ్ర సేంద్రీయ వ్యవసాయ విధానాలను పాటించి రైతులకు ఆదాయాన్ని పెంచే విధానాన్ని రైతులకు వివరించడం జరిగింది. తరువాత కే.వి.కే మృత్తిక శాస్త్రవేత్త ఏ.కిరణ్ పాల్గొని, జీవామృతం, ఘన జీవామృతం, వేస్ట్ డీకంపోజర్ &వర్మి కంపోస్ట్, తయారుచేసుకొని వాడటం ద్వారా పెట్టుబడులు తగ్గించుకోని భూసార పెంచుకోవచ్చని ప్రాక్టికల్ గా తయారు చేసి తెలియజేశారు. తరువాత సేంద్రీయ పద్ధతిలో వివిధ రకాల కషాయలు అగ్నిస్త్రం, దశపర్ణి కషాయలు, నీమాస్త్రం తయారీ చేసి వాటి ఎలా చీడపిడలని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే శాస్త్రవేత్తలు ఎ.కిరణ్ & పి.అక్షిత్ సాయి, అభ్యుదయ సేంద్రియ రైతు వి. శేషు కుమార్, సిరి ఫౌండేషన్ చైర్మన్ ఎం.గోపయ్య 45 మంది రైతులు పాల్గొన్నారు.
