పయనించే సూర్యుడు జనవరి 9 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో నూతన సర్పంచులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులుగా శాంతిగూడెం గ్రామానికి చెందిన శాంతిగూడెం గ్రామ సర్పంచ్ అయిన చింతలపూడి భాస్కర్ రెడ్డిని డిండిమండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతిని వెంకటేశ్వరావు, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, వివిధ గ్రామాల నూతన సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.