పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 బోధన్: సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ లైప్ కోచ్ అడ్డిగ శ్రీనివాస్ మోటివేషనల్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు అడగడం, వినడం, అనుసరించడం వంటి అలవాట్లను పెంపొందించుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, తద్వారా దీర్ఘకాలిక సంతోషాన్ని పొందగలరని తెలిపారు. స్వల్పకాలిక సంతోషాల కోసం విద్యను నిర్లక్ష్యం చేయడం, మొబైల్ ఫోన్లను అతిగా వినియోగించడం, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను గౌరవించకపోవడం వంటి అలవాట్లను పూర్తిగా మానుకోవాలని సూచించారు.విద్యార్థులు ప్రతి విషయంపై శ్రద్ధతో చదివితే, ఆ విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకంలో నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. విద్యే జీవితానికి బలమైన పునాది అని,క్రమశిక్షణతో కూడిన అధ్యయనమే భవిష్యత్తుకు దారి చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మరియు ప్రధానోపాధ్యాయులు రాజీ మంజుషా, విద్యార్థి జీవితంలో మంచి క్రమశిక్షణ పెద్దలకు గౌరవించడం, మహానీయుల అడుగు జాడలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పురానే విజయ్ కుమార్, గంధం సాయిలు, దండు రాజ్ కుమార్, రుద్ర సంతోష్ యాదవ్, విఠల్ కాంబ్లే, అరుణ్ కుమార్ పాలెంకర్, గాండ్ల అబ్బయ్య, సంగీతరావు, లింబగిరి జ్యోత్స్న, శోభారాణి, సుధారాణి, విజయలక్ష్మి, బగరే లక్ష్మి, వనజ, స్వర్ణ, మేడి రవి, జాదవ్ అక్షయ్, సాయిలు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.