సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నియామకాలలో అక్రమాలు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ -09 సింగరేణి సంస్థలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నియామకాల విషయంలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. స్థానికులు మరియు భూ నిర్వాసితులను పూర్తిగా విస్మరించి, సింగరేణి అధికారులు మరియు సెక్యూరిటీ కాంట్రాక్టర్లు కుమ్మక్కై దళారీ వ్యవస్థగా మారి నాన్‌లోకల్ వ్యక్తులకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారం పసిగట్టిన స్థానిక కాంగ్రెస్ నాయకులు గట్టిగా నిలదీశారు.స్థానిక యువతకు రావాల్సిన ఉద్యోగాలను దూరం చేసి, డబ్బు ఉన్నవారికి మాత్రమే అవకాశాలు కల్పించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేసి, స్థానికులు మరియు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శభీరుద్దీన్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య,మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కూరి అవినాష్ గౌడ్,కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ కాటం సత్యం, పెద్దపల్లి జిల్లా మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షులు ముల్మూరి శ్రీనివాస్, బిజెపి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్దం మురళి, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు ఉడుత శంకర్, బండ కిరణ్ రెడ్డి, సంతోష్ గౌడ్, ఐ ఎన్ టి యు సి నాయకులు శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *