
పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-09 రామగుండం-3 & అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సి.ఎన్.సి.ఓ.ఏ. క్లబ్ నందు రామగుండం-3 ఏరియా సేవా, లేడీస్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు అలివేణి సుధాకర రావు, వెంకటలక్ష్మి నాగేశ్వర రావు అధ్యక్షతన బొమ్మల కొలువు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆపరేషన్స్ సతీమణి మాలతి - ఎల్.వి. సూర్య నారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, సతీమణి విజయ లక్ష్మి - వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఇ & యం సతీమణి పద్మ - తిరుమల రావు, హాజరయ్యారు. వేడుకలలో భాగంగా ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల సాంప్రదాయంగా నిర్వహించే ఈ బొమ్మల కొలువు వేడుకలు ఇప్పటికీ ఏ మాత్రం వన్నె తగ్గకుండా మహిళలందరూ ఉత్సాహంగా నిర్వహించుకోవడం చాలా సంతోషమని అన్నారు. ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప సాంప్రదాయమని, దీనిని భవిష్యత్ తరాల వారికి కూడా అందజేయడం మనందరి బాధ్యత అని అన్నారు. తద్వారా సంస్కృతి, సాంప్రదాయాలు చిరకాలం వర్ధిల్లుతాయని అన్నారు. ప్రస్తుత జీవన శైలిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించడం ద్వారా ముందు తరాల వారు సన్మార్గంలో నడుస్తారన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలను, తోటి మహిళలను ప్రోత్సహించాలన్నారు. ఈ వేడుకలలో భాగంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని, వివిధ రకాల బొమ్మలను చక్కగా అలంకరించిన మహిళలందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరం వేడుకలలో ప్రత్యేకంగా ప్రకృతి సోయగాల నడుమ కొలువైన శ్రీరాముని నేపథ్యంతో చేసిన అలంకరణ అందరినీ ఆకట్టుకుందన్నారు. ఇదే ఉత్సాహంతో మన్ముందు మరిన్ని వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. బొమ్మల కొలువులో భాగంగా రామాయణం ఘట్టం, అష్ట లక్ష్మీ లు, ఆదివరాహ స్వామి, లక్ష్మీనరసింహా స్వామి, వినాయకుడు, కృష్ణుడు, తదితర దేవీ దేవతల విగ్రహాలు, ఇతర అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా క్లబ్ పరిసరాలలో వేసిన రంగవల్లులు, పల్లె ప్రజల జీవన విధానాన్ని తెలియజేసే వివిధ ఏర్పాట్లు ఆవరణకు అందాన్ని తెచ్చిపెట్టాయి. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడటం లాంటి అంశాలతో ఏర్పాటు చేసిన బొమ్మలు అవగాహన కల్పించేలా ఉన్నాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో లేడీస్ క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులను ప్రధానం చేసారు. ఇట్టి కార్యక్రమానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్. మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, రామగుండం-3 ఏరియా మాజీ జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు లు హాజరై బొమ్మల కొలువు ను వీక్షించారు. వారు మాట్లాడుతూ మన సాంస్కృతి సాంప్రదాయ లను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం చాలా బాగుందని అందరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-1,2, భూపాలపల్లి, ఏరియాల సేవా, లేడీస్ అధ్యక్షురాల్లు అనిత లలిత్ కుమార్, వనజా వెంకటయ్య, సునీత రాజేశ్వర్ రెడ్డి, లేడీస్ క్లబ్ కమిటీ సభ్యులు హరిత, లావణ్య, నిఖిత , కోమలి, శైలజ, లక్ష్మీ, లతో పాటు లేడీస్ క్లబ్ సభ్యులు, సేవా సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.