పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం స్వామి సార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ మరియు డిప్యూటీ సర్పంచ్ దోబ్బల యాదయ్య మరియు ఒకటవ వార్డ్ నెంబర్ కయ్యుం, మూడవ వార్డ్ నెంబర్ సభావత్ కవిత, నాలుగవ వార్డ్ నెంబర్ జ్యోతి ఐదవ వార్డ్ నెంబర్ శివానంద్ , ఆరవ వార్డ్ నెంబర్ పిప్పల గణేష్, ఏడవ వార్డ్ నెంబర్ నేనవత్ కిషన్ ఎనిమిదవ వార్డ్ నెంబర్ మల్లేష్, తొమ్మిదో వార్డ్ నెంబర్ కోబ్రా బండ స్రవంతి పదవ వార్డ్ నెంబర్ దొబ్బాల అనితా లను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధితో పాటు తమ యొక్క పాఠశాల అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరి సహాయకారాలు ఉండాలని స్కూల్ హెచ్ఎం స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు స్కూలు ఉపాధ్యాయులు యువకులు తదితరులు పాల్గొన్నారు.