
పయనించే సూర్యుడు, జనవరి 10, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల కేంద్రం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా పండగ సంబరాలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి యదు సింహారాజు , భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రిన్సిపల్ రాజశ్రీనివాసరావు విచ్చేసి, ముగ్గుల పోటీలను, పాఠశాల అభివృద్ధిని అభినందించారు. పాఠశాలలో ముగ్గుల పోటీలు ఆకర్షణీయంగా నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. మొదటి మూడు స్థానాలు సాధించినవారికి 1వ, 2వ, 3వ బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న అందరికీ కూడా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు ముత్తవరపు రాజశేఖర్ , కార్యదర్శి పొదిలా పుల్లయ్య , సహ కార్యదర్శి ఓరుగంటి సురేష్ కుమార్ , కోదుమూరి లక్ష్మి సునీత , గుంటుపల్లి స్వప్న , కళ్యాణి , ప్రధాన చార్య రెడ్డి నాగమల్లేశ్వరి , ఆచార్య బృందం, కమిటీ సభ్యులు, విద్యార్థులు, హితేశులు పాల్గొన్నారు.