పయనించే సూర్యుడు 10-1-2026 గొల్లపెల్లి మండల ప్రతినిధి( ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా రేకులతో షాపు నిర్మాణాన్ని చేశారు. అడిగేవారు లేక చెప్పేవారు లేక ఎవరి ఇష్టం వారు అన్నట్టుగా గొల్లపెల్లి మండల కేంద్రం లోనే ప్రభుత్వ సంబంధించిన స్థలాలు కబ్జాకు గురవుతున్న అధికారులు మాత్రం స్పందించలేరు అని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను ఇకనైనా నిలిపివేయాలని అధికారులని పాలకులను స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.