పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.10.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండల కేంద్రంలో ఉన్న సామజిక ఆరోగ్య కేంద్రంలో కామెర్ల వ్యాధి నిర్ధారణ కొరకు పరీక్ష చేసే ల్యాబ్ కొన్ని నెలలుగా అందుబాటులో లేదని అందువలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజలను ఆదుకోవాలని “ఆదివాసీ సంక్షేమ పరిషత్ “(274/16) ఉమ్మడి అల్లూరి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు అన్నారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న చిన్న పిల్లలకు కామెర్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిమిత్తం ప్రైవేట్ ల్యాబ్ కు పంపిస్తున్నారని కొన్ని సార్లు ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేస్తున్నారని చిన్న పిల్లల తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల్లో కొందరు తమ దృష్టికి తీసుకుని వచ్చారని ఈ పరీక్ష చేసేందుకు 300/-రూపాయలు తీసుకుంటున్నారని వారు తెలిపారని ఆయన అన్నారు ఈ విషయంలో వివరణ కోరగా ఇక్కడ కామెర్ల నిర్ధారణ పరీక్షలు లేవని అందుకే బయట చేయించుకోమని చెప్తున్నామని కామెర్లు ఉంటే ఒక ప్రత్యేకమైన గదిలో పెడుతున్నామని ఆ గదిలో పెట్టటం వలన కామెర్లు తగ్గుతాయని అన్నారని ఆయన అన్నారు గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో ఒక డాక్టర్ ప్రైవేట్ ల్యాబ్ తో సంబంధం పెట్టుకుని ప్లేట్ లెట్స్ నిర్ధారణ పరీక్ష అవసరం లేకపోయినా జ్వరంతో వచ్చిన ప్రతి రోగికి ప్లేట్ లెట్స్ నిర్ధారణ పరీక్ష చేయించుకోమని సిపారసు చేసేవారని ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుందని ఆయన అన్నారు అడ్డతీగల సామజిక ఆరోగ్య కేంద్రంలో నిరంతరం అనేక రకాల వైద్య పరీక్షలు ప్రతి రోజు అవసరం అవుతాయని ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది అనారోగ్యానికి గురైన రోగులు వస్తారని వారిలో కొంతమంది నిరుపేద కుటుంబాలు కూడా ఉంటారని అలాంటి వారికి ప్రైవేట్ గా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం సమస్యతో కూడుకున్న వ్యవహారమని డబ్బులు లేక వారు వైద్య పరీక్షలు చేయించుకోకపోతే వ్యాధి ముదురి మరణాలు జరిగే అవకాశం ఉందని దీనికి ఎవరు బాధ్యులు అవుతారని ప్రశ్నిస్తూ..అలా జరిగితే ఆసుపత్రి యాజమాన్యం మరియు ప్రభుత్వమే బాధ్యులు అవుతారని ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకోవద్దని తక్షణమే ఆసుపత్రిలో ఉండవలసిన అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆసుపత్రి యాజమాన్యానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి హెచ్చరించారు.