అదుపు తప్పి కాలువలోకి జారిన ద్విచక్ర వాహనం, ఒకరికి గాయాలు, అస్పత్రికి తరలింపు.

పయనించే సూర్యడు న్యూస్, జనవరి 10, 2026, ఖమాన, వాంకిడి, కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. వాంకిడి మండలం, ఖమాన గ్రామంలోని, లింబరావు గూడా సమీపంలో గల కాలువలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి సోనాపూర్ చీచ్పెల్లీ గ్రామానికి చెందిన నాయుడు శుభం (నాని) కి గాయలయ్యాయి. గురువారం రాత్రి 11గంటలకు కోపగూడ కీ వెళ్లి వస్తువుండగా మద్యం మత్తులో కాలువలోకి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడింది. లింబరావు గూడా గ్రామానికి చెందిన కొందరు గమనించి 108 కీ సమాచారం అందించగా ఈ. యం. టి ప్రవీణ్ యాదవ్, పైలెట్ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని అతి కష్టం మీద కాలువలోకి దిగి ఒడ్డుకి తీసుకు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి సమపంలోని వాంకిడి ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. రాత్రి టైం లో ఆలస్యం చెయ్యకుండా వచ్చిన 108 సిబ్బందికి గ్రామ ప్రజలు అభినందనలు తెలియచేశారు.