అధికారులు జవాబుదారీగా ఉండాలి ప్రతీ అర్జీ పరిష్కారం చేస్తాం

★ ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే శిరీషాదేవి

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.10.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దరఖాస్తుల పరిస్కారంలో అధికార యంత్రాంగం పూర్తి పారదర్శకంగా ఉండాల్సిందేనని రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు చింతూరు మండల కేంద్రంలో తెదేపా మండల పార్టీ అధ్యక్షులు జమాల్ ఖాన్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ…దరఖాస్తు దారులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుందన్నారు వ్యక్తిగత సామజిక సమస్యల పరిస్కారంలో ముందుంటున్నామని ఆమె స్పష్టం చేశారు అదే రీతిలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిస్కారంలో జవాబుదారీగా ఉండాలన్నారు ప్రజా దర్బార్ కి హాజరు కాని సిబ్బంది పై చర్యలు చేపట్టాలని ఆదేశించారు అలాగే దర్బార్ లో ఆమె దృష్టికి వచ్చిన పలు సమస్యలు వెంటనే పరిస్కారం చేశారు కొన్నింటిని సంబంధిత శాఖలకు సిఫార్సు చేసి సకాలంలో పరిస్కారం చేయాలని సూచించారు ఒకవేళ పరిస్కారం కాకపోతే దానికి గల కారణాలు దరఖాస్తుదారునికి తెలుపుతూ ఎక్కడ దానికి పరిస్కారం దొరుకుతుందో దరఖాస్తు దారునికి తెలియ జేయాలని సూచించారు సాధ్యమైనంత వరకూ ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహారించాలన్నారు తమ స్థాయిలో పరిస్కారం కాని సమస్యలు ఉంటే తన దృష్టిలో పెడితే ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు ప్రతీ దరఖాస్తుదారు తమ వినతితో పాటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తో ఆయా ప్రభుత్వ శాఖల వారికి అందజేస్తే దానికి తిరిగి రసీదు ఇస్తారని ఇక్కడ నమోదు కాబడిన ప్రతీ అర్జీ పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వ యంత్రాంగం దరఖాస్తు దారులకు ప్రభుత్వం పై నమ్మకం కలిగేలా వ్యవహారించాలని కోరారు లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పన్నారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సరియం చిట్టిబాబు ఏ.ఎమ్.సి డైరెక్టర్లు సాల్మన్ రాజు క్లస్టర్ ఇంచార్జి నర్సింహారావు పి.రామారావు యూనిట్ ఇన్ చార్జి శీలం తమ్మయ్య ఆరుకు పార్లమెంట్ ఎస్టీ విభాగం అధ్యక్షులు ఇల్లా చిన్నా రెడ్డి కట్ట శంకర్ వాస శ్రీరామూర్తి రెడ్డి జీ.సురేష్ కుమార్ తహసీల్దార్ హుస్సేన్ మండలం పరిషత్ అభివృద్ధి అధికారి సుండం శ్రీనివాస్ దొర ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ కోటి రెడ్డి సొసైటీ చైర్మన్ మాచినేని రాజేష్ మండల పార్టీ అధ్యక్షులు బొర్రా నరేష్ శ్రీను మంగేశ్వరరావు మంగవేణి జనసేన ప్రతినిధి రవి పలు శాఖల అధికారులు అధిక సంఖ్యలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.