అనిగండ్లపాడు శ్రీ చైతన్య హై స్కూల్ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జనవరి 10 పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు శ్రీ చైతన్య హై స్కూల్లో శుక్రవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ నగేష్, నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకల్లో పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటలు ప్రదర్శన చేసారు. భోగి మంటలు వేశారు. ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారికీ బహుమతులు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో మన పండగలు తెలియజేస్తాయని, కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగల ద్వారా మనమందరం భారతీయులమని చాటి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు