అయ్యప్ప స్వామి మహా ఇరుముడి పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్రాష్ట్ర నాయకులురవి యాదవ్ అతిథిగా పాల్గొన్నారు.

పయనించే సూర్యుడు, జనవరి 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శుక్రవారం రోజు శేరిలింగంపల్లి నియోజక వర్గం పాపిరెడ్డి కాలనీలోని శివాలయం ఆలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా ఇరుముడి పూజా కార్య క్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాలధారుల బృందం బాలు గురుస్వామి, నాగేశ్వరరావు గణే ష్, దశరథ్, కాశీ, యాదగిరి, మహేష్, నవీన్, మనోజ్ తదితరులు పాల్గొని,అయ్య ప్ప స్వామి నామస్మరణతో శబరిమల యాత్రకు భక్తిపూర్వకంగా బయలు దేరారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఇరుముడి ధరించిన భక్తులకు మారబోయిన రవి యాదవ్ శాలువాలు కప్పి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది స్వామి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజ లందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో వెంకట్ రెడ్డి, సాయి నందన్ముదిరా జ్, పవన్, శ్రీకాంత్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.