ఈస్ట్ జోన్ టోర్నమెంటులో రన్నరపుగా నిలిచిన ఖమ్మం లయన్స్

★ క్రీడాకారులను అభినందించిన ప్రముఖులు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 10, తల్లాడ రిపోర్టర్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ గోల్డ్ కప్ పోటీలలో ఈస్ట్ జోన్ టోర్నమెంట్ లో బరిలోకి దిగిన ఖమ్మం లయన్స్ టీమ్ రన్నరప్ గా నిలిచింది. తెలంగాణ గోల్డ్ కప్పు ఈస్ట్ జోన్ టీంకు ఖమ్మం జిల్లా తరఫునుంచి ఆరుగురు క్రీడాకారులు సెలెక్ట్ అయ్యారు. వారిలో ఎస్.కె. ఇమ్రాన్, బి. గౌతమ్,కె.సూర్య కే.ఎస్.పి, ఎం.పవన్ పి. కరుణాకర్, వై. వరప్రసాద్ సెలెక్ట్ అయ్యారు. ఖమ్మం లయన్స్ టీమ్ ను సెలెక్ట్ అయిన క్రీడాకారులను అభినందించారు. ఖమ్మం జిల్లా టీసీఏ అధ్యక్షులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి గుండాల వీరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు వీడిఐ రాజీవ్ రాజ్, వెంకటప్రసాద్, మహిళా క్రీడాకారిణి రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాధిక, సీనియర్ క్రికెటర్ రాజశేఖర్ పాల్గొన్నారు .