పయనించే సూర్యుడు జనవరి 10 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:-ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు అరకిల్ల పరమేశ్వర్ తిగుట్ల రాజ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు నిరుద్యోగులు దళితులు రైతులు విద్యార్థులను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఫాం హౌస్‌లు నిర్మించుకున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంత్ ఉట్నూర్ ఉప సర్పంచ్ మస్రత్ ఆన్సర్ అలీ ఎస్సీ సెల్ నాయకులు కొత్తపల్లి మహేందర్ ప్రభాకర్ భాస్కర్ రాజేశ్వర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.