ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

పయనించే సూర్యుడు జనవరి 10 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ ఉద్యోగ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు, సీపీఎస్ రద్దు, ఓపిఎస్ పునరుద్దరణ,ఎన్ఈపీ 2020 రద్దు,ఏమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని పాపన్నపేట ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు శుక్రవారం కొడపాకలో నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపారు. జడ్పీ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆరోగ్యం, శాంతాకుమారి, ఉపాధ్యాయులు ప్రవీణ్,రమేష్, కేవీ ఆర్ నాయుడు, వెంకట్ రెడ్డి, నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, కొమ్ముశ్రీను, దత్తాత్రి, చంద్రశేఖర్, సురేష్, సిద్దిరాములు, వెంకటేశం, నారాయణ ఉన్నారు.